సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్, 03 ఫిబ్రవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు సుల్తానాబాద్ మండలం, మున్సిపాలిటీ స్థాయి క్రీడలు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో దివ్యదర్శనరావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల విద్యాశాఖ అధికారి ఆరెపల్లి రాజయ్య, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత శారీరకంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల ప్రతిభకు మంచి వేదిక లభిస్తోందని పేర్కొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్ జి ఎఫ్ కార్యదర్శి తాండ్ర ప్రణయ్, ప్రకాష్(పెద్దన్న) వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, సంధ్య, శ్రీవాణి,ఆసియా, సరోజ,స్వప్న,వెంకటేష్, మధుకర్, సంపత్, సత్యం, ఇక్బాల్, అజ్జు, రంజిత్, మమత విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *