సింగరేణి రామగుండం-3 డిస్పెన్సరీ లో ఇంటర్కమ్ టెలిఫోన్ సౌకర్యం ప్రారంభం

★ప్రారంభించిన రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు.

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ,ఫిబ్రవరి-04:- ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడడానికి అత్యవసర సమయంలో కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ చాలా కీలకమని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు అన్నారు.మంగళవారం రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా లోని స్థానిక సింగరేణి డిస్పెన్సరీ నందు ఏర్పాటు చేసిన ఇంటర్కమ్ టెలిఫోన్ సౌకర్యాన్ని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడడానికి అత్యవసర సమయంలో కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రతి నిమిషం చాలా కీలకమని, అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన వారికి వైద్య సిబ్బంది అన్ని రకాల సహాయ, సహకారాలు అందించి మెరుగైన వైద్యం అందించాలని, ఇంకా మెరుగైన వైద్య పరీక్షలు చేయడానికి కావలసిన నూతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకుందామని, అట్టి పరికరాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.అత్యవసర సమయాల్లో ఇంటర్కం టెలిఫోన్ నెంబర్ 593, 594, లకు ఫోన్ చేయవచ్చునని, అదేవిధంగా ఎస్.టి.డి, సెల్ నుండి ఫోన్ చేసేవారికి 08728-260593, 08728-260594 నంబర్లకు ఫోన్ చేయవచ్చునని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షులు కోలా శ్రీనివాస్, ఎస్వోటుజిఎం బండి సత్యనారాయణ, ఐఇ డీజీయం బి.టి.మురళీకృష్ణ, పర్సనల్ విభాగధిపతి బి.సుదర్శనం, మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఏరియా వర్క్ షాప్ డీజీయం రామ్ రెడ్డి తోపాటు ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.