సార్వత్రిక సమ్మె ముందస్తు నోటీసు అందజేసిన ఆశ వర్క్ లు…

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) కేంద్రం లో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రంగా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న న దేశ వ్యాప్తంగా జరగనున్న సమ్మె లో ఆశ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ కోరారు. సార్వత్రిక సమ్మె లో భాగంగా మండలం లోని ముల్కనూర్ పిహెచ్ సి హాస్పిటల్ ఎదుట మంగళవారం ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన చేసి, వైద్య అధికారి శివ కుమార్ కు ముందస్తూ సమ్మె నోటీసు ను అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్ల కు ఫిక్స్‌డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, పెండింగ్‌ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించి,ఆశ ల పై అధిక పని భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఆశ లకు ఇచ్చిన హామీలు అమలయ్యేoత వరకు ఆశా వర్కర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఆశ వర్కర్ యూనియన్ నాయకులు పి. రమాదేవి, ఉమాదేవి, నమ్మి,సుజాత, ఆశకుమారి,సత్యవతి, కౌసల్య, జ్యోతి, పుష్ప, మంగతాయి, శాంత, నిరోషా, భద్రమ్మ, అరుణ, వీరమ్మ, నాగరత్నం, దేవి, విజయ,తదితరు లు ఉన్నారు..