శ్రీ శ్రీ శ్రీ ఆది ఆంజనేయస్వామి దేవాలయం పూజారి అనారోగ్యంతో మృతి

★పరామర్శించిన మరికల్ గ్రామస్తులు…

సాక్షి, డిజిటల్ న్యూస్, మరికల్, ఫిబ్రవరి 3, 2026, (రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ ఆది ఆంజనేయ స్వామి దేవాలయం పూజారి జంగం చంద్రశేఖర్(65) మృతి చెందినట్లు మరికల్ గ్రామ ప్రజలు తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ ఆది ఆంజనేయ స్వామి దేవాలయం పూజారిగా ప్రజలకు సేవలు అందించడం జరిగిందన్నారు. దేవాలయం పూజారి ఆకస్మిక మృతి మరికల్ గ్రామానికి తీరనిలోటు అన్నారు. గ్రామ అఖిలపక్ష నాయకులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.