శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం – నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు.. జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి :3 కామారెడ్డి జిల్లా ప్రతినిధి పిట్ల :అనిల్ కుమార్, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ సందర్భంగా భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్… మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ. చివరి రోజు సందర్భంగా, జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన పటిష్ట భద్రతా ఏర్పాట్లను ఆయన సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు.విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు మరియు అభ్యర్థులు ఎన్నికల నియమావళిని .తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని,శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్.హెచ్.ఓ నరహరి,రూరల్ ఇన్‌స్పెక్టర్ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఎస్.ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.