సాక్షి డిజిటల్ న్యూస్:జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 04 రిపోర్టర్ షేక్ సమీర్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ, సీపీఎం పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో సహకారంతోనే వైరా మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీ 25 నెలల్లో 25 పైసాల పని కూడా చేయలేదు… మళ్లీ మున్సిపాలిటీలో అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థి గుడిమెట్ల రజిత గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు సీపీఎం పార్టీ నాయకులు మద్దెల రవి, గుడిమెట్ల మోహన్ రావు విలాసగరం నరేష్, సుంకర ఉదయ్ భాస్కర్, అప్పారావు, రమణ మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
