సాక్షి డిజిటల్ న్యూస్ బలిసిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి బలిజిపేట పీహెచ్సి లో ఆశా డే వైద్య అధికారిని డాక్టర్ క్రాంతి కిరణ్మయి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ప్రోగ్రాం కీ జిల్లా మలేరియా అధికారిని వై. మని హాజరై ఎండీ ఏ ప్రోగ్రాం పై ఆశా లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ లో మని మేడం మాట్లాడు తూ ఫిబ్రవరి 10 నుంచి 12 వ తేదీ వరకు బూత్ లెవెల్ లో మాత్రలు మింగించాల ని భోజనం తరువాత మాత్రమే మాత్రలు వేయించాలని 2 నుంచి 5,సంవత్సరం లోపు పిల్లలు కు 1 డి ఇ సి మాత్ర 1 ఆల్బండాజోలు మాత్ర 6-14 సంవత్సరం ల పిల్లలు కు 2 డి ఇ సి మాత్రలు 1ఆల్బ్బెండ్జోలు మాత్ర 15 సంవత్సరం లు పై న 3 డి ఇ సి మాత్రలు 1 ఆల్బండాజోలు మాత్ర వేయించాలి అని సూచించారు ఈ ప్రోగ్రాం లో వైద్య అధికారులు డాక్టర్ క్రాంతి కిరణ్మయి గారు మాధురి గారు స్కోప్ సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 2సంవత్సరం లు లోపు పిల్లలు కు 60 సంవత్సరం లు దాటినా వాళ్ళ కీ దీర్ఘ కాలిక వ్యాధులు వారికీ ఈ మాత్రలు వేయించ కూడదు అని ఆమె సూచించారు.13 వ తేదీ నుంచి ఇంటింటికి 22 వ తేదీ వరకు మాత్రల మింగించే ప్రోగ్రాం జరుగుతుంది అని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఆశాలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.