సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విద్యార్థులు అభ్యసించి, సామర్థ్యాలతో అధిగమిస్తూ, నూటికి నూరు శాతం పదో తరగతి ఫలితాలు సాధించాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం గార్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిలకు ప్రేరణ తరగతులను ఆయన నిర్వహించారు. అభివృద్ధికి కావలసిన నైపుణ్యాన్ని ప్రేరేపించేది లక్ష్యమని, లక్ష్యం లేని జీవితం లేదని, కండరాలు లేకుండా వ్యాయామం చేస్తే ఎలా ఉంటుందో.. అలాగే లక్ష్యం లేకుండా అభ్యసించి చదువు అంతే అన్నారు. తదుపరి 12 మంది బాలికలకు సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన క్రీడా దుస్తులను భూక్య హరినాయక్ తో పాటుగా ఆయన చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నివృత్తి చేశారు, ఈ సందర్భంగా హెచ్ఎం మాచర్ల సుందర్ కుమార్ ఆధ్వర్యంలో బోధన సిబ్బంది సమన్వయంతో గంగావత్ వెంకన్న సార్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం మాచర్ల సుందర్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్ ఎడ్ల అప్పయ్య మోటివేషన్ స్పీకర్ వజ్రం నాగేశ్వరరావు ఆ పాఠశాల బోధన సిబ్బంది ఎం సురేందర్ రెడ్డి పి వెంకట్ రెడ్డి, ఎండి అబ్దుల్ ఖదీర్ టీ మంజుల ఎం బాల్య ఎం రజని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…
