విదేశాల్లో ఉన్నా జన్మభూమి విద్యార్థులపై ఆదరణ భేష్.

★ఎస్.ఐ, టి.అనిల్ కుమార్.

సాక్షి డిజిటల్ న్యూస్:3 ఫిబ్రవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు( రాము) ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే నానుడి(ఎన్నారై) పద్మ, నాగభూషణ్ రావు దంపతులకే చెల్లిందని ఎస్.ఐ అనిల్ కుమార్ ప్రశంసించారు. తమ దివంగత తల్లిదండ్రులు కరణం చెంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల పేరుతో తన జన్మస్థలమైన తంబళ్లపల్లె హైస్కూల్లోని నిరుపేద విద్యార్థులకు ప్రతిఏటా ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వం చాటుకోవడం ఆదర్శవంతమని కొనియాడారు.మంగళవారం దివంగత చంగల్ రావు, ఆది లక్ష్మమ్మ ల జ్ఞాపకార్థం హైస్కూల్లో 6 నుండి10వ తరగతి వరకు నిరుపేద ప్రతిభ కలిగిన 30 మంది విద్యార్థులకు రూ2వేలు చొప్పున రూ 60వేలు ఎస్సై తోపాటు హెడ్మాస్టర్ శ్రీనివాసులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, నాగభూషణరావు ప్రతినిధి శంకర్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మగ్గాలు లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.