సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 3 రొంపిచర్ల మండలం, రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులు అరెపరెడ్డి రెడ్డప్ప రెడ్డి(75) కుటుంబానికి తాను అండగా ఉంటానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అయన మంగళవారం గానుగచింత గ్రామ పంచాయతీ మారంరెడ్డిగారిపల్లెలో రెడ్డెప్పరెడ్డి కుటుంబ సభ్యులు కుమారుడు యుగంధర్ రెడ్డి, కుమార్తెలు రాణిరత్న, పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోడం తీవ్ర బాధకరమన్నారు. మృతుని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని బరోస కల్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, జెడ్పీటీసీ రెడ్డిశ్వర్ రెడ్డి, వసుంధర, రామకృష్ణనాయుడు, సురేంద్రనాయుడు, సురేఖ లను కుమార్ నాయుడు, సదాశివరెడ్డి, బాబు, రెడ్డిశేఖర్ రెడ్డి, నాగరాజతదితరులు పాల్గొన్నారు.
