రాష్ట్ర శాంతి భద్రతలు కరువయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు.

సాక్షి డిజిటల్: న్యూస్ రంపచోడవరం డివిజన్ ప్రతినిధి. కె.ప్రకాశరావు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధిపై దృష్టి సారించకుండా, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వరుసగా దాడులు చేసే ప్రయత్నాలకే పరిమితమైందని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అభివృద్ధిపై దృష్టి సారించకుండా, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై వరుసగా దాడులు చేసే ప్రయత్నాలకే పరిమితమైందని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని ఆరోపించిన ఆమె, రాజకీయ కక్ష సాధింపుతో వైయస్సార్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాన్ని వేధించే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో పట్టణ కేంద్రాలలో నెయ్యి కల్తీ అంశంపై, సిట్ (SIT) చార్జ్‌షీట్‌కు విరుద్ధంగా, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వై.వి. సుబ్బా రెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు, అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా వాటిని సామాజిక మాద్యమాలలో, ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి, జడ్పీటీసీ పండ రామకృష్ణ వెంకట లక్ష్మి, ఎంపీపీ బంధం శ్రీదేవి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు జల్లేపల్లి రామన్న దొర, వైస్ ఎంపీపీ పండ కుమారి గమ,సర్పంచ్లు మంగ బొజ్జయ్య, వడగల ప్రసాద్, కోసు రమేష్ బాబు, కుంజం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ ఉలవల లక్ష్మి, కోడి పూజ, రుతు,రామకృష్ణ, నాగన్న దొర, గంగవరం మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జు వెంకటేశ్వరరావు, మారేడుమిల్లి మండల ఎంపీపీ సార్ల లలిత కుమారి, బోప్ప శేఖర్, రత్న రాజు, చితుకుల రెడ్డి, కాజవల్లి, యూత్ ప్రెసిడెంట్ పండు, బాబురావు, శివ, త్రినాథ్, ఇబ్రహీం, షేక్ లాలి, సత్తిబాబు, పండ సూరిబాబు, కుంజం రాజన్న దొర, డా.సెల్వ స్టార్, ఏనుపల్లి వెంకటేశ్వరరావు, నండూరి రాంబాబు, చాకలి నాగేశ్వరావు, వీక నాగేశ్వరావు, సంకుమల్ల యేసు, రేమల రాజు, కొండరాజు,బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *