రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరం..

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 3, యడ్లపాడు మండల ప్రతినిధి.. దమన చర్యలు మంచివి కావని యడ్లపాడు వైసీపీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్ వ్యాఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్నాయని యడ్లపాడు మండల వైసీపీ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశ్నించే నాయకులపై కేసులు పెట్టడం, దాడులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేయడం, దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి దమనకాండ చర్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తన తీరు మార్చుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, రాజకీయ కక్షతో సాగిస్తున్న ఈ చర్యలను వెంటనే విరమించుకోవాలని పఠాన్ రెహ్మాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకులకు వైసీపీ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు… పఠాన్ రెహ్మాన్ ఖాన్ యడ్లపాడు మండల వైసీపీ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *