రాయికల్ రాజకీయంలో రగడ

★కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎన్నికల నుంచి తప్పుకునట్టు ప్రకటన ★కాంగ్రెస్ పట్టణ యువజన అధ్యక్షుడు, పట్టణ మహిళా అధ్యక్షురాలు పార్టీ కి రాజీనామా

సాక్షిడిజిటల్ న్యూస్,రాయికల్,ఫిబ్రవరి 04, (వై.కిరణ్ బాబు):- జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్‌లో కాంగ్రెస్ పార్టీలో బీ- ఫామ్ కేటాయింపుల తీవ్ర కలకలం రేపింది.ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం – మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం మధ్య హోరాహోరీ రాజకీయ పోరు కొనసాగుతోంది.కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో జీవన్ రెడ్డి వర్గాన్ని పక్కనపెట్టి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గీయులకు టికెట్లు కేటాయించడమే ఈ రాజకీయ అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.రాయికల్ పట్టణం లో మొత్తం 12 వార్డులకు గాను ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ ఉన్నప్పటికీ తెరచాటుగా ఎమ్మెల్యేవర్గం బీ–ఫామ్‌లు తెచ్చుకుందనిజీవన్ రెడ్డి వర్గం సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి సన్నిహిత కార్యకర్తలు, సీనియర్ నేతల ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి వర్గీయులు రాయికల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన ప్రకటన చేశారు.2వ వార్డులో కాంగ్రెస్ బీ–ఫామ్ సాధించిన రాయికల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల రమేష్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.అలాగే కాంగ్రెస్ పట్టణ యువజన అధ్యక్షుడు బత్తిని నాగరాజు,కాంగ్రెస్ పట్టణ మహిళ అధ్యక్షురాలు తాటిపాముల మమత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.ఈ పరిణామాలతో రాయికల్ కాంగ్రెస్‌లో చీలిక స్పష్టంగా బయటపడింది.ఇప్పుడు అందరి చూపు ఈ పరిణామాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుంటుంరా..?ఈ రాజకీయ ఉత్కంఠను రాయికల్ పట్టణ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.