సాక్షి డిజిటల్ న్యూస్ 4 ఫిబ్రవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి, జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం రంగదాముని పల్లె గ్రామంలో. పెద్దగుట్ట ప్రాంతంలో, కాంటూరూ కందకాలు తవ్వకం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో రవీందర్రావు, తన సిబ్బందితో కలసి ఉపాధి హామీ పనులను మంగళవారం రోజున పరిశీలించారు. ఉపాధిహామీ సిబ్బందితో మాట్లాడుతూ, ఎంతమంది ఉపాధి శ్రామికులు పనికి వస్తున్నారు, పనులు ఎంతవరకు వచ్చాయి ఒక్కొక్క శ్రామికునుకి ఎంత కూలీ పడుతోంది అని విచారించి, మాస్టర్లు పరిశీలించి తదితర విషయాలను ఉపాధి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు, పనులు చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఉపాధి శ్రామికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి రాథోడ్ ,ఫీల్డ్ అసిస్టెంట్ నడిమెట్ల మహేష్ జెల్లా అనిల్ కుమార్, ఉప సర్పంచ్ ఎలగందుల శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.