సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 03, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ యువర్ చైతన్య యూత్ సభ్యులు మంగళవారం సర్పంచ్ చెలిమెల శ్రీనివాసు, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ ను కలిసి కాలనీలోని డ్రైనేజీ మంచినీటి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు సమస్యలను తొందర్లోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు, ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు సర్పంచులు ఉపసర్పంచ్ ను శాలువా కప్పి సన్మానించారు, అదేవిధంగా ఫిబ్రవరి 5వ తారీఖున ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్టీఆర్ యూత్ సభ్యులకు సర్పంచ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.