మెట్ పల్లి లో15వ వార్డులో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్న అరిగెల అనూష.

*ప్రజల సేవకుడు అరిగెల రాకేష్.

(సాక్షి డిజిటల్ న్యూస్ మెట్పల్లి మండల్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ) 3 ఫిబ్రవరి 2026, భారతీయ జనతా పార్టీ నుంచి 15వ వార్డు నుండి పోటీ చేస్తున్న అరిగెల అనూష ను భారీ మెజారిటీతో గెలిపించాలని తన భర్త అయినా అరిగెల రాకేష్ ప్రజలతో విన్నపించారు. ఇటు ప్రజలతో మమేకంతో ఉంటూ ప్రజా సమస్యలతో పోరాడుతూ మరియు తన సొంత డబ్బులతో సైనిక్ ఫౌండేషన్ తో అక్కడి వార్డు ప్రజలకి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ ఉన్నాడు. తన సతీమణిని గెలిపిస్తే ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపడతానన్నారు. తనవంతుగా తన వార్డు లో తన సతీమణి అయిన అరిగెల అనూషను గెలిపిస్తే తన వంతు ప్రతి ఒక్క పేదరిక ఆడబిడ్డకు వివాహ కానుకగా 5,000 వేలరూపాయలు ఇస్తానన్నాడు మరియు వైద్య నిమిత్తం ప్రసవ సమయంలో తన వంతుగా కృషి చేస్తానన్నారు అంతే కాకుండా వార్డులోని సమస్యలను దగ్గరుండి డ్రైనేజీ వ్యవస్థను సిసి రోడ్ల మరమ్మతు గురించి తను గెలిచిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు .కులమత బేధాలు లేకుండా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతానని ఒకసారి అవకాశం ఇస్తే ముందు ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు . అలాగే ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు తనతో ఉండాలని కోరారు. ఒకసారి అవకాశం ఇస్తే ప్రజా నాయకురాలిగా కాకుండా తన సతీమణి ప్రజాసేవకురాలిగా ప్రజలతో ప్రజల కోసమే పని చేస్తారని ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపించగలరని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *