సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 (రిపోర్టర్ పేరు నరేష్ చిక్కెల)ఆర్మూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల దాఖల పరిశీలన(స్క్రూటిని) పరిశీలించి అభ్యర్థుల యొక్క గుర్తులను విడుదల చేశారు. ఇందులో కొద్దిగా స్వచ్ఛందంగా నామినేషన్ దాఖలను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల నుండి కొందరి అభ్యర్థి ఆశవాహులు టికెట్ రాకపోవడంతో నిరాశకు గురయ్యారు పార్టీలలో అంతర్గత కుమ్ములాట వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అభ్యర్థులకు రాకపోవడంతో గత కొంతకాలంగా ప్రధాన పార్టీలో క్రియాశీల సభ్యత్వం మొదలుకొని కార్యకర్తలుగా పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకర విషయం అని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రధాన పార్టీలో అభ్యర్థులను గెలిపించుకోవడం మా భుజస్కందాలపై ఉందని బి-ఫామ్ రాని అభ్యర్థులు తెలియజేశారు. స్వతంత్ర అభ్యర్థులు తమ ఉనికిని చాటుకోవడానికి ముందుకొస్తూ వార్డులను అభివృద్ధి చేసే దిశలో రావడం అభినందనీయమని స్థానికులు కస్తున్నారు.