ముగిసిన సీఎం కప్ మండల స్థాయి పోటీలు.

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 03 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి జమ్మికుంట మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం రోజున ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) హేమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అత్యంత అవసరమని అన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా మరింత కృషి చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడా పోటీల్లో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కోరపల్లి ప్రిన్సిపల్ కేతిరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శ్రీలత, పిడి శ్రీనివాస్, రేణుక, ప్రేమలత, ఉమ, మంగ, అప్స, కృష్ణవేణి, ఓం ప్రకాష్, భగత్, పాల్గొన్నారు.