సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 4 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ కొడిమ్యాల మండల స్థాయి ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. బహుమతి ప్రధానోత్స కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా కొడిమ్యాల మండల తహసిల్దార్ కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ… క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఎస్ఐ సందీప్ కుమార్ తో కలిసి ఆయన బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్, ఎంఈఓ అయిత శ్రీనివాస్, ఎస్ఐ సౌదం సందీప్, ప్రధానోపాధ్యాయురాలు ఏ.విజయేంద్ర, ఎస్జిఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్, ఎస్జిఎఫ్ మండల కార్యదర్శి బూట్ల రాజ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.