మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే

*ఓదెల శ్రీమల్లికార్జున స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల అందరిపై ఉండాలి..

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పయనించే సూర్యుడు న్యూస్,: పెద్దపల్లి, ఫిబ్రవరి- 04: ఓదెల శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 12 నుండి నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు,13న స్వామి వారి కళ్యాణం,15 న మహాశివరాత్రి కి సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తమ స్వగృహంలో దేవస్థాన కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ…ఓదెల దేవస్థానం అభివృద్ధికి పక్క ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలోని అతిపెద్ద శైవ క్షేత్రాల లో ఒకటైన ఓదెల బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తురులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, డైరెక్టర్లు జంగం కొమురయ్య, కోదాటి మనోహర్ రావు, జీలుక రవీందర్, కట్కూరి సమ్మిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్, తీర్థాల రాజారాం, ఈరవేన రవికుమార్, ఉప్పుల శ్రావణ్ కుమార్, గంట రమేష్, సామల యమున, ప్రధాన అర్చకులు, ఎక్స్ అఫీషియో మెంబర్ ధూపం వీరభద్రయ్య, అర్చకులు అభిషేక్, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, భక్త బృందం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *