సాక్షి డిజిటల్ న్యూస్ మరిపెడ రిపోర్టర్ ఇస్లావత్ హేమ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు అభ్యర్థి గాండ్ల సుజాత మైపాల్ రెడ్డి గారికి మద్దతుగా 13వ వార్డ్ కి చెందిన ఇమ్రాన్ ఆధ్వర్యంలో 50 ముస్లిo కుటుంబల సభ్యులంతా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మరియు మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కలిసి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. షాదీ ముబారక్ తో పేద ముస్లిం ఆడపిల్లల పెండ్లికి మేనమామల తోడు నిలిచిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని స్థానికులను కోరడం జరిగింది.