మన్ననూర్ కుంచోనిమూల ప్రతాపరుద్రుని కోట సమీపంలో చిరుత పులి సంచారం*

★భయాందోళనలో స్థానిక ప్రజలు

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) అమ్రాబాద్ నలమల్ల ప్రాంతంలోని హైదరాబాద్-శీశైలం హైవే పై ప్రతాపరుద్రుని కోట,కుంచోనిమూల, శివాలయం ప్రాంతాల్లో గత మూడు రోజులుగా చిరుత పులి సంచారిస్తుందన్న వార్త కలకలం రేపుతోంది సాయంత్రం 6 గంటల తర్వాత ఈ ప్రాంతంలో సంచరిస్తూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది ఇప్పటికే రంగాపూర్,దర్గతాండ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచులకు సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సమాచారం ఇచ్చారు అదేవిధంగా అచ్చంపేట మండలం గుంపన్ పల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు సాయంత్రం 4 గంటల తర్వాత ప్రజలు వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు ప్రస్తుతం వేరుశనగ పంట సీజన్ కావడంతో గ్రామాల్లో చాలా మంది రైతులు వేరుశనగ పంట సాగు చేస్తున్నారు పంటను అడవి పందుల బారినుండి కాపాడుకోవడానికి రాత్రి సమయంలో రైతులు పంటపొలాలకు కావాలి వెళ్లవలసి వస్తుంది కానీ చిరుత పులి ఏ సమయంలో తమపై దాడి చేస్తుందోనన్న భయంతో కొంత మంది రైతులు ఇంటి వద్దనే నిద్రిస్తున్నారు దింతో పంట పొలం అడవి పందుల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కావున సంబంధిత ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని సదరు చిరుత పులిని బందిచి సురక్షితంగా అడవి లోపల వదలాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.