మంథని మాజీ ఎమ్ ఎల్ ఏ ఇక లేరు

★మంగళవారం ఉదయం తుది శ్వాస విడిసిన రాంరెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ పిబ్రవరి 3 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో మంథని ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ముత్తారం ఎంపీపీగా, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి ఐదేళ్లపాటు శాసనసభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తనవిగా భావించి పనిచేశారు. ముఖ్యంగా రైతుల కష్టాలు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మిన నేతగా, రాజకీయాలకు మానవత్వాన్ని జోడించిన వ్యక్తిగా రాంరెడ్డి గుర్తుండిపోతారు. రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైనది. మంచితనానికి మారుపేరుగా నిలిచిన ఆయన ఇక లేరన్న నిజం మంథని ప్రజలకు తీరని లోటుగా మారింది.