భూముల కౌలు ద్వారా రూ 13,314 ఆదాయం.

సాక్షి డిజిటల్ న్యూస్ :3 ఫిబ్రవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు( రాము) తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ మాన్యం భూములను ఏడాదికి కౌలుకు వేలం పాటల ద్వారా రూ 13,314 ఉదయం లభించినట్లు టీటీడీ ఏఈఓ గోపీనాథ్ తెలిపారు. మంగళవారం వెంకటేశ్వర ఆలయంలో జరిగిన టెండర్ రహిత వేలం పాటలలో స్వామివారి మాన్యం 9.49 1/2 ఎకరాల భూమిని వ్యవసాయ సాగు వేలం పాటల నిర్వహించారు. ఈ వేలం పాటల ద్వారా రూ 13 314 ఆదాయం సమకూరింది. ఈ వేలం పాటల కార్యక్రమంలో తాసిల్దార్ లలితాంజలి, టిటిడి సిబ్బంది నగేష్, నాగరాజు, విజిలెన్స్ సిబ్బంది, వేలంపాటదారులు, ప్రజలు పాల్గొన్నారు.