బీ ఫామ్ లు అందజేసిన డీసీసీబి మాజీ ఛైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు . ఫిబ్రవరి 04. చండూరు మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది.  డీసీసీబి మాజీ ఛైర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అభ్యర్థుల చేతికి బీ-ఫామ్‌ లు అందజేశారు. దీంతో మున్సిపల్ కోటపై ‘హస్తం’ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచార పర్వం ఊపందుకుంది. బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు నామినేషన్లు సమర్పించాలని సూచించారు.”అధికారికంగా బీ-ఫామ్‌లు అందాయి.. ఇక ప్రభుత్వ ప్రజారంజక పాలనను, అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. చండూరు మున్సిపల్  అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఏ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *