బి.ఆర్.ఎస్ అభ్యర్థుల జాబితాలో వ్యూహాత్మక మార్పులు

సాక్షి డిజిటల్ న్యూస్, ఏప్రిల్ 3, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో వ్యూహాత్మక మార్పులు చేసింది. కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత చర్చలు, ఏకాభిప్రాయంతో రెండు వార్డుల్లో అభ్యర్థులను మార్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు. పెబ్బేరు మున్సిపాలిటీ 4వ వార్డు బి.ఆర్.ఎస్ అభ్యర్థిగా ఎం.బి.బి.ఎస్ విద్యార్థిని పవిత్రను పార్టీ అధికారికంగా ప్రకటించింది. అలాగే వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీలకు చెందిన బి.ఆర్.ఎస్ అభ్యర్థులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీ–ఫారంలను అందజేశారు. పార్టీ పట్ల విధేయత కలిగి, ప్రజల్లో క్రియాశీలకంగా పనిచేసే నాయకులను ఎంపిక చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బి.ఆర్.ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, పలుస రమేష్ గౌడ్, దిలీప్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కర్రె స్వామి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.