సాక్షి డిజిటల్ న్యూస్ బలిసిపేట మండల రిపోర్టర్ సిహెచ్ మురళి బలిజిపేట మండలం లో బలిజిపేట పీహెచ్సి వైద్య అధికారిని డాక్టర్ క్రాంతి కిరణ్మయి గారి ఆధ్వర్యంలో స్పర్శ ర్యాలీ ప్రోగ్రాం జరిగింది. జనవరి 30 నుంచి 13 వ తేదీ వరకు కుష్ఠు వ్యాధి పై స్పర్శ ప్రోగ్రాం లో భాగంగా ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ లో స్పర్శ లేని మచ్చ కుష్ఠు వ్యాధి కావొచ్చు ఎం డి టీ మందులతో వ్యాధిని నయం చేయవచ్చు అనే నినాదా ల తో బలిజిపేట పురవీధుల్లో ర్యాలీ చేసి బస్టాండ్ వద్ధ మానవ హారం తో నినాదాలు చేసారు. ఈ ప్రోగ్రాం లో వైద్య అధికారిని మాధురి గారు స్కోప్ సిబ్బంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
