బండ్ల గణేష్ సంకల్ప యాత్రకు కడపలో ఘన స్వాగతం

*జనసేన పార్టీ నేత దాసరి రవిశంకర్

సాక్షి డిజిటల్ న్యూస్,కడప: ఫిబ్రవరి :3,(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకునే సంకల్పంతో సినీ యాక్టర్, నిర్మాత బండ్ల గణేష్ చేపడుతున్న సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తూ కడప జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గ జనసేన పార్టీ నేత డా. దాసరి రవిశంకర్ బండ్ల గణేష్‌ను సాదరంగా స్వాగతించి, శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. రవిశంకర్ మాట్లాడుతూ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు జిల్లా అధ్యక్షుడు కె.పి. వెంకట రమణ, హరి, గోసల ఆంజనేయులు, నాగ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *