సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కానాగేశ్వరరావు, ఫిబ్రవరి 4 2026 ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలి - లేబర్ కోడ్ రద్దు చేయాలి కార్మిక చట్టాలను పటిష్ట పరచాలి.ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ సమ్మె నోటీసు గోళ్ళమూడి, అనసాగరం, లింగాలపాడు, డివిఆర్ కాలనీ, పి హెచ్ యు పి హెచ్ డాక్టర్లకి సమ్మే నోటిష్ అందించడం జరిగింది. కనీస వేతనం ఇవ్వాలి పర్మిట్ చేయాలి. స్కీం వర్కర్ల ను కార్మికులుగా గుర్తించి చట్టబద్దమయినా సౌకర్యాలు కల్పించాలి. ఆశ వర్కర్లు నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఆశ వర్కర్లకి 10 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.ఏఎన్ఎం, జి ఎన్ ఎం, శిక్షణ పొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టులు భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలి.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ యూనియర్ నాయకులు, నాగమణి, సునీత, కవిత, ఆదిలక్ష్మి, సుజాత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.