ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

*టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రావు పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 04 రిపోర్టర్ షేక్ సమీర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏధులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో కార్మికులతో కలిసి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం గోపాలరావు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ లు 2026 ఫిబ్రవరి 12 న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస హక్కులు కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం 2025 ను ఉపసంహరించుకోవాలని, పేదలకు పని గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేంద్ర బిజెపి తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలని జరగబోయే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు
పార్లమెంటులో మంద బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్నారని గోపాలరావు దుయ్యబట్టారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టి యు సి ఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు రాయల సిద్దు కార్మికులు రాధ స్రవంతి స్వరూప రమాదేవి రమాదేవి రజిత శ్రావణి సునీత లక్ష్మి అరుణ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఇట్లు రాయల సిద్దు టియుసిఐ కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *