ప్రీతి రజస్వల కార్యక్రమం లో గంటా

ఆనందపురం సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భాగం స్వాతి సుధాకర్ ఫిబ్రవరి 03: బంకు రాజు కుమార్తె రజస్వల కార్యక్రమం కి గంటా రాకతో సందడి నెలకొంది ఆనందపురం తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు (కాంట్రక్టర్) బంకు రాజు కుమార్తె ప్రీతి రజస్వల కార్యక్రమం కి భీమిలి నియోజకవర్గం యంయల్ఏ గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. నాయకులు ఆయనకు ఘనమైన సాదర స్వాగతం పలికారు. కాసేపు బంకు రాజు కుటుంబం తో సంభాషించి తర్లువాడ పంచాయతీ సర్పంచ్ బిర్బి నాయుడు ని మండలం రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బంకు రాజు కుమార్తె ను గంటా శ్రీనివాసరావు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో తర్లువాడ పంచాయతీ సర్పంచ్ బిర్బి నాయుడు, ఆనందపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాట్రాజు అప్పారావు, మజ్జి రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.