ఆనందపురం సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి.రిపోరటర్ భాగం స్వాతి సుధాకర్.పిబ్రవరి 3: గ్రామ కంఠం, ప్రభుత్వ భూములలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపించాలని విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరం పంచాయతీ జిఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన అమరపల్లి నరేష్ సోమవారం జిల్లా కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు.విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, రామవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గంగసాని అగ్రహారం గ్రామంలో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములను కాపాడాలనే ప్రజా ప్రయోజన ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ హరింద్రీ ప్రసాద్ వినతి పత్రం అందజేశానని బాధితుడు నరేష్ తెలిపారు. రామవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1, 130,ల లో కొంతకాలంగా కొందరు వ్యక్తులు అక్రమంగా నివాస గృహాల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు.ఈ అక్రమ నిర్మాణాల విషయమై గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, తహసిల్దార్ లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు కొంతవరకు చర్యలు తీసుకొని నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేసి మమ అనిపించారని ఆరోపించారు.మరల అదే ప్రభుత్వ భూమిలో అక్రమ ఇళ్ల నిర్మాణాలకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించిన నా పదవిలో సంబంధిత వ్యక్తులు బెదిరింపు లకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా ప్రయోజనాలు కోసం ఫిర్యాదు చేసిన ఓ సాధారణ పౌరుడిపై ఈ విధమైన ఒత్తిడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఆర్డీవో దృష్టికి సంబంధిత విషయాన్ని తీసుకువెళ్లినప్పటికీ క్షేత్రస్థాయి వీఆర్వో గతంలో ఇచ్చిన వివరణ ఇవ్వడం గమనార్హం అన్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి వైకాపా హయాంలో, ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.దీంతో పాటు క్షేత్రస్థాయి విచారణ జరిపించి అక్రమంగా మంజూరైన ఇంటి పన్నులు, విద్యుత్ కనెక్షన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.