ప్రజాక్షేత్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలురామకుప్పంలో జనతా వారది ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు చిత్తూరు జిల్లా బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ప్రధాన కార్యదర్శిలు అట్లూరి శ్రీనివాసులు విజయ్ కుమార్ ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు సమస్యలు పరిష్కారం కొరకు జనతా వారిది కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు దానిలో భాగంగా సోమవారం రామ కుప్పం మండల పరిషత్ కార్యాలయం వద్ద రామకుప్పం మండలం బిజెపి అధ్యక్షులు రాణి జనార్దన్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఆంజనేయప్ప, ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు వెంకటరమణ రాష్ట్ర గ్రంథాలయ బోర్డ్ డైరెక్టర్ మునుస్వామి ఎస్సీ ఎస్టీ సెల్ సభ్యులు జయశంకర్ క్లస్టర్ ఇంచార్జి రవి రెడ్డి టిడిపి మాజీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి ఆనంద్ రెడ్డి సంఘీభావం తెలిపారు మీరు చేస్తున్న పని చాలా మంచి పని ప్రజా ప్రజాక్షేత్రంలో పనిచేయడం చాలా గొప్ప విషయమని బిజెపి నాయకులను అభినందించారు వికలాంగులకు సంబంధించి మండల కేంద్రంలోని వైద్యాధికారులు ఉండి వారికి దృవపత్రంలో ఇవ్వాలని ఎంపీడీవో లక్ష్మీకాంత్ కి రెవిన్యూ సమస్యలపై తాసిల్దార్ కౌలేష్ కి బిజెపి నాయకులు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ అధ్యక్షులు జయరాం రెడ్డి, రామకుప్పం మండలం బిజెపి ప్రధాన కార్యదర్శిలు బి నాగరాజు నరేంద్ర కుమార్, , కార్యదర్శి రవి గురుస్వామి, సోషల్ మీడియా ప్రతినిధి లోకేష్ రెడ్డి బిజెపి నాయకులు మురళి రామచంద్రప్ప సుకుమార్ రెడ్డి ఇంకా పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *