సాక్షి డిజిటల్ న్యూస్ వైరా 3/2026 ఖమ్మం జిల్లా వైరా వైరా ఫిబ్రవరి 3న వల్లపురం గ్రామంలోని పశుగణాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పశువుల గర్భకోష వ్యాధుల ఉచిత వైద్య శిబిరం సర్పంచ్ మన్నెం హనుమంతరావు, వేల్పుల నారాయణ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత తుమ్మల రాణా ప్రతాప్ వైరా మండల యాదవ సంఘం అధ్యక్షుడు రామస్వామి వీరి ఆధ్వర్యంలో మంగళవారం పశువైద్య శిబిరాన్ని ప్రారంభిం చారు సందర్భంగా మండల పశువైద్యాధికారి ఎం రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో సకాలంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించడం వలన కలిగే లాభదాయక ఆదాయం, ఎక్కువ పాలు దిగుబడి, వాటికి వచ్చు గర్భకోశ వ్యాధుల గురించి సీజనల్ వచ్చు గాలికుంటు వ్యాధుల గురించి గ్రామంలోరైతులకు తగు జాగ్రత్తలు అవగాహన కల్పించడం, గ్రామంలో 20పశువులకు,10చూడి పరీక్షలు,20 దూడలకు మరియు120 గొర్రెలకు నత్తల నివారణ మందులు గర్భకోశ వ్యాధులకు నివారణకు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపాల మిత్ర సూపర్వైజర్ ఎస్.కె అబ్దుల్ మీరా, గోపాల మిత్రులు ఎస్.కె కాసిం, ఈ ప్రభాకర్, డి శేషగిరి, ఎస్.కె సుభాని, వెంకయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.