నూర్ బాషా దూదేకుల సంఘం నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 3 ఆలూరు తాలూకా లోని నూర్ బాషా దూదేకుల సంఘం నాయకులకు టిడిపి నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని నూర్ భాషా దూదేకుల సంఘం హోళగుంద మండల ఆ ధ్యక్షులు టి పి సాయిబేస్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలూరు తాలూకాలోని ఆరు మండలాలలో సుమారు 32,000 మంది నూర్ బాషా దూదేకుల ఓట్లు ఉన్నాయని, అలాంటి ఆ సంఘం నాయకులకు ఏ ఒక్కరికి కూడా టిడిపి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను ఇవ్వలేదని, ఇప్పటికైనా స్పందించి టిడిపి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులలో దూదేకుల సంఘం నాయకులకు గుర్తించాలని ఆయన అన్నారు రానున్న ఎన్నికలలో నూర్ భాషా దూదేకుల సంఘం ఏమనేది చూపిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *