దుబ్బ రాజేశ్వర స్వామి బ్రహోత్సవాలకు రండి..

★మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వాన పత్రిక అందించిన కమిటి సభ్యులు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ భైరం నారాయణ 3 ఫిబ్రవరి 2026, జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లోని పెంబట్ల – కోనాపూర్ లోని శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ కమిటి సభ్యులు మంగళవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వాన పత్రికను అందజేశారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13వ తేది నుంచి 17వ తేది వరకు నిర్వహిస్తుమని బ్రహ్మోత్సవాలకు తప్పకుండ హాజరు కావాలని మంత్రి ని కమిటి సభ్యులు కోరారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.