ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

*ఎస్సై. తిరుపాల్ నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, ఫిబ్రవరి :3, (పులివెందులతాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్సై. తిరుపాల్ నాయక్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో , తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపాల్ నాయక్ మాట్లాడుతూ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. మద్యం సేవించి నడపడం, మైనర్ లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే సెల్‌ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. వీటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సందర్భాల్లో వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, వాహన పత్రాలు, తమ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుల్ రఘునాథ్ రెడ్డి, రాంబాబు,నాయబ్ రసూల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *