జిల్లాలోని గర్భిణీలు, బాలింతలు,ఆశా కార్యకర్తలు హెల్ప్ డెస్క్ సేవలు వినియోగించుకోవాలి .

★జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్ .

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ సేవలను జిల్లాలోని గర్భిణీలు బాలింతలు ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే రవికుమార్ అన్నారు. మంగళవారం నాడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలోని హెల్ప్ డెస్క్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న గర్భవతులకు, బాలింతలకు,ఆశా కార్యకర్తలకు,మహిళలకు, హెల్ప్ డెస్క్ సిబ్బంది సహకారిగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న రికార్డులను ప్రత్యేకంగా పరిశీలించారు. హైరిస్కు ఉన్న గర్భవతులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రికి వస్తున్న గర్భవతులకు గర్భిణీ చెక్అప్ లు, ప్రసవాలకు తప్పనిసరిగా స్త్రీ వైద్య నిపుణులకు చూయించి వారికి సేవలు అందించాలని ఆయన సూచించారు. గర్భిణీలు బాలింతలకు ఉచిత రవాణా కొరకు 102,108 ఆరోగ్య సేవలు వినియోగించాలని, అదేవిధంగా వారికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ ఓరుగంటి శ్రీనివాసులు,పి. నరసింహ, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి.యాదగిరి,పి. పద్మ, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.