చురుగ్గా సెంట్రల్ లైటింగ్ పనులు

*సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయితే జుక్కల్ కు కళా రానుంది

సాక్షి డిజిటల్ న్యూస్: ఫిబ్రవరి 04, రిపోర్టర్: జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్:దత్తు కామారెడ్డి జిల్లా. జుక్కల్ మండల కేంద్రంలో రూ.4 కోట్ల వ్యయంతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆర్అండ్బి రోడ్డు మధ్యలో నుంచి అటు.. ఇటు 50 పిట్ల మేర పనులు చేపడుతున్నారు. ఒకవైపురోడ్డును తవ్వి మొరం వేసి చదును చేస్తున్నారు ఇప్పటికే రోడ్డు అనుకొని ఉన్న నిర్మాణాలను స్థానికులుస్వచ్ఛందంగా తొలగించారు. చిరు వ్యాపారులు దుకాణాలను వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి ఉందని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *