చిట్యాల లో మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీ పా రాల ను అందజేసిన ఎమ్మెల్యే వీరేశం

*కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే *ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

సాక్షి డిజిటల్ న్యూస్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభ్యర్థులకు బీ ఫారాల ను అందజేసి ఎన్నికలలో ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. చిట్యాల లో ప్రచారంలో భాగంగా 07వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేశపాక లత – రాజేష్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని 07 వ వార్డులో డ్రైనేజీ, రోడ్లు తాగునీరు పారిశుద్ధ్యం వంటి ప్రతి సమస్యను గుర్తించి కాలపరిమితిలో పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటిస్తూ 07వ వార్డు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్ జడల చిన్న ఆది మల్లయ్య లక్ష్మీ నరసింహ స్వామి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *