చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ-కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన పొత్తు

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 04. చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ-కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన పొత్తుపొత్తులో భాగంగా సిపిఐ చండూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ను కేటాయించారు. ఈమేరకు ఆ పార్టీ మాజీ డిసిసి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి చండూరులోని సిపిఐ కార్యాలయంలో ఎమ్మెల్సీ , సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తో కలిసి సిపిఐ-కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఒప్పంద నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేసి చండూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు, మెజారిటీ వార్డులు గెలిచేందుకు కృషిచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *