ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ తీర్థ మహోత్సవం ఆకట్టుకున్న గుర్రపు పందాలు, ముగ్గుల పోటీలు

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం ఫిబ్రవరి 3 : కొత్తకోట శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో గుర్రపు పందాలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో 30 మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి ఆకర్షించారు. అలాగే ఆలయ వెనుక భారీ స్థలంలో గుర్రపు పందాలు నిర్వహించారు. ఆరుగురు ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలో కొత్తకోట గ్రామానికి చెందిన బేరా రాము రెండు నిమిషాల మూడు సెకండ్లలో స్వారీ చేసి ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన బేరా మణికంఠ రెండు నిమిషాల 12 సెకండ్లలో స్వారీ చేసి ద్వితీయ స్థానంలోనూ, ఇదే గ్రామానికి చెందిన మొరముల్ల కొండ మూడు నిమిషాల 14 సెకండ్లలో స్వారీ చేసి మూడవ స్థానంలోనూ నిలిచారు. విజేతలకు నగదు బహుమతు లను నిర్వాహకులు అందించారు. గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ గుమ్మడు సత్యదేవ, ఎంపీటీసీ కుంచా లక్ష్మీ శంకర్రావు, గ్రామ నాయకులు వెల్లంకి ఈశ్వరరావు, ఉగ్గిన శ్రీనివాసరావు, మైచర్ల శ్రీనివాసరావు, గట్రెడ్డి శ్రీనివాసరావు, గట్రెడ్డి దివాకర్, ఉపాధ్యాయుడు గుమ్ముడు కన్నయ్య దొర పలువురు గ్రామ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..శేషు రావికమతం.