సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 3 రామ్కుప్పం రిపోర్టర్ జయరాంరెడ్డి చిత్తూరు జిల్లా స్వాతంత్ర పూర్వంలోని కర్ణాటక రాష్ట్రం మైసూరు సంస్థానాదీషులు నాల్వడి చామరాజ వడియార్ మహారాజుల వద్ద జనోపకారి అను ప్రశంసను పొంది లక్షల కోట్ల ఆస్తులను పేద గాండ్ల కులస్తుల కోసం దానంగా ఇచ్చిన గాండ్ల కుల బాంధవుడు జనోపకారి శ్రీ దొడ్డన్న శెట్టి 186వ జయంతి ఉత్సవాలను మంగళవారం రామకుప్పం మండల కేంద్రంలో గాండ్ల యువజన సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆటో సర్కిల్ వద్ద శ్రీ దొడ్డన్న శెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల వ్యాప్తంగా గల గాండ్ల కులస్తుల పేద విద్యార్థులు బెంగళూరు లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలేజీ మరియు దొడ్డన్న చెట్టి హాస్టల్లో చదువుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడ్డారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కుప్పం నియోజక వర్గంలో గల గాండ్ల కులస్తుల వందలాదిమంది విద్యార్థులు బెంగళూరులోని దొడ్డన్న శెట్టి హాస్టల్లో ఉచితంగా భోజన వసతి పొంది అక్కడ ఉన్న మంచి విద్యాలయాల్లో చదువుకొని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రామకుప్పం మండల గాండ్ల కులస్తులు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.