ఘనంగా ఉచిత వైద్య శిబిరం

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 03:రిపోర్టర్ తిరుపతి సిద్దిపేట భారత్ నగర్ లో గాల డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు, ఈ వైద్య శిబిరంలో సుమారుగా 50 మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారని డాక్టర్ చంద్రప్రకాష్ గారు తెలిపారు మరియు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత ఓ.పి తో పాటు రోగులకు వివిధ రకాల పరీక్షలు మరియు మందులను డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు మరియు మన సిద్దిపేటలో ఇటువంటి వైద్య శిబిరాలు ముందు ముందు డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ వారి ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు మహేందర్, ఎల్లప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రప్రకాష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది.