పయనించే సూర్యుడు న్యూస్: ఫిబ్రవరి: 03 కడప ప్రతినిధి: వెంకటేష్ కొన్నిపాటి కడప జిల్లా సిద్ధవటం మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన నటరాజ కులుకు చెక్క భజన గురువు వరికుంట్ల సాయికృష్ణ పేద కుటుంబంలో జన్మించి కళా లే తన సర్వం అంటూ చెక్క భజన లో మంచి గురువు గా గుర్తింపు పొందారు ప్రకాశం జిల్లా మార్కాపురం గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 77వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా మేరా భారత్ మహన్ పురస్కారం చెక్క భజన గురువు వరికుంట్ల సాయికృష్ణ అందుకున్నారు గురువు సాయి కృష్ణ చెక్క భజన, కోలాటం ,జడకోపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకమైన కళా ను నేర్చుకుని రాష్ట్ర అవార్డు గ్రహీత సగిలి పుల్లయ్య గారి దగ్గర చెక్క భజన నేర్చుకుని తను కూడా ఒక గురువు గా ఎదగాలని కష్టపడి చెక్కభజన నేర్చుకొని గురువుగా ఎదిగారు తన చెక్క భజన లో ఎంతోమంది శిష్యులు కళాకారులను తయారు చేసినటువంటి గురువు సాయి కృష్ణ చెక్క భజన లో, వాగ్దేవి సంగీత నృత్య కళాశాల వారి నుండి ఉత్తమ నంది అవార్డు పురస్కారమును కూడా పొందారు ఇలా ఎన్నో అవార్డులను అందుకున్నారు తన గ్రామంలో శిష్యులు, పెద్దలు ,కళాకారులు అందరూ ఆయనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.