గడ్డివాము దగ్ధం రూ అరవై వేలు ఆస్తి నష్టం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 3 మండల కేంద్రమైన హోళగుంద లోని సినిమా థియేటర్ వెనకాల ఉన్న కాలనీలో సోమవారం షర్ట్ సర్క్యూట్ జరిగి గాదిలింగప్ప గడ్డివాము దగ్ధం అయినట్లు బాధితుడు గాదిలింగప్ప ఎస్ డి పి ఐ నాయకులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వారు దాదాపుగా 60వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందన్నారు నాలుగు నెలల క్రితం విద్యుత్ ఏ ఈ ఓబులమ్మ కు స్థంభం విరిగిపోయిన విషయం తెలిపిన కూడా పట్టించుకోకుండా విద్యుత్ అధికారులు కాలయాపన చేశారని విద్యుత్ అధికారులపై కాలనీవాసులు ఎస్డిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యను వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు ఎస్ డి పి ఐ కార్యకర్తలు పాల్గొన్నారు