సాక్షి డిజిటల్ న్యూస్:ఫిబ్రవరి 3 ఆత్మకూర్ ఎం మండల రిపోర్టర్ మేడి స్వామి, లింగరాజుపల్లి గ్రామంలో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యకు పరిష్కారం గ్రామంలో చాలా సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతుల బెడదను తప్పించేందుకు వైయస్సార్ ఫౌండేషన్ అధినేత ఆత్మకూరు మండల సర్పంచుల పోరం అధ్యక్షులు గ్రామ సర్పంచ్ యెర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎలుగుబంటి వేషం వేయించి కోతులను గ్రామం నుండి తరిమికొట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ యెర్ర సోమిరెడ్డి మాట్లాడుతూ కోతులు ఇళ్లపై దాడులు వృద్ధులు పిల్లలు భయంతో జీవించాల్సిన పరిస్థితి గ్రామ ప్రజలకు ఊరట కలిగిస్తా ఏళ్ళుగా చెప్పుకుంటూ వచ్చిన సమస్యను మాటల్లో కాకుండా చర్యల్లో పరిష్కరించి చూపించిన నాయకత్వం ఇది ప్రజల సమస్య నా సమస్యగా భావించి నిరంతరం పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని ఈ సందర్బంగా తెలిపారు.