కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్న వైసీపీ మైనార్టీ విభాగం..

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 3 యడ్లపాడు మండల ప్రతినిధి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను అణిచివేసే చర్యలకు పాల్పడుతోందని పల్నాడు జిల్లా వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శి సయ్యద్ కరిముల్లా తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం, వారి నివాసాలపై దాడులు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటీవల అంబటి రాంబాబుపై జరిగిన దాడి, ఆయనతో పాటు మైనార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్పై జరిగిన దాడి ఈ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారిందన్నారు. ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర మైనార్టీ విభాగం పిలుపునిస్తోందని సయ్యద్ కరిముల్లా తెలిపారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకులకు వైసీపీ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సయ్యద్ కరిముల్లా
పల్నాడు జిల్లా వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *