కుటుంబ సభ్యులను ఓదార్చిన ఖానాపురం మేజర్ సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు :03.02.2026 బుధరావుపేట గ్రామం, ఖానాపురం మండలం బిఆర్ఎస్ యూత్ సభ్యుడు మడత శ్రీనివాస్ అమ్మమ్మ బుధరావుపేట గ్రామ వాస్తవ్యురాలు కీ.శే మామిండ్ల సత్తమ్మ (85) గారి పార్థివ దేహానికి పూలమాలవేసి, కుటుంబ సభ్యులను ఓదార్చిన ఖానాపురం మేజర్ సర్పంచ్ దాసరి రమేష్… మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన మామిండ్ల సత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నేడు మృతిచెందగా.. విషయం తెలుసుకున్న ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ వడ్డే రాజశేఖర్, యూత్ నాయకులు వడ్డె వెంకటేష్, గంగాపురం అనిల్, ఉప్పు కిరణ్, మాసారపు శ్రీనివాస్,ఖలీల్, కోల రాజు తదితరులు పాల్గొన్నారు.