కార్పోరేషన్‌ పై మేయర్ పీఠం దక్కించుకోనున్న ఎర్ర సైన్యం.

★ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ★సీపీఐ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ఇన్చార్జ్ పనిత మార్కు కొత్తగూడెం ఫిబ్రవరి 03, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉన్న సీపీఐ అభ్యర్థులకు మంగళవారం స్థానిక శేషగిరి భవన్‌లోని సీపీఐ కార్యాలయంలో అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం పై దిశ నిర్దేశాలు చేసిన లోకల్ కార్యకర్తలతో సంయమనం పాటించాలని చెప్పి అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, ఈ నెల 11న జరగనున్న కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల కోసం సీపీఐ తన అభ్యర్థులను ప్రకటించిందన్నారు. టీడీపీ, ప్రజల మద్దతుతో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రజాక్షేత్రంలోకి దిగుతుందని తెలిపారు. సీపీఐ బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పూర్తిగా పార్టీ కార్యకర్తల కోరికలు అనుగుణంగానే కొత్తగూడెం కార్పొరేషన్ వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ఏ నాయకులు తీసుకున్నది, కాదు స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలయ్యాయని, మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేశామని చెప్పారు. ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ ప్రాంతంలో జరిగిందని, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ పరిధిలో 25వ వార్డు తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, దీని ద్వారా ఆ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుందని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు శక్తులు కుట్రలు పన్నాయని, వాటిని తిప్పికొట్టుతూ సీపీఐ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం అనతికాలంలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌ను ప్రకటించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, సీపీఐ అభ్యర్థులు గెలిస్తే కొత్తగూడెం కార్పొరేషన్ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరాలంటే ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని మరోసారి పిలుపునిచ్చారు…